Bheemavaram: నేడు భీమవరానికి రఘురామకృష్ణరాజు.. టెన్షన్ టెన్షన్

  • చాలా కాలం తర్వాత నేడు భీమవరానికి రఘురామరాజు
  • ఏం జరుగుతుందోనని సర్వత్ర ఆసక్తి
  • తనను అరెస్ట్ చేయకుండా చూడాలని హైకోర్టులో పిటిషన్
  • ఆయన విషయంలో చట్టప్రకారం నడుచుకోవాలని పోలీసులకు హైకోర్టు ఆదేశం 
  • సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయవాదులతో వస్తున్న ఎంపీ
Narasapuram MP Raghurama krishnam Raju today arrives Bheemavaram

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నేడు స్వస్థలానికి రానుండడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చాలాకాలం తర్వాత ఆయన భీమవరం రానుండడంతో ఏం జరగబోతోందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మోదీ రేపటి భీమవరం పర్యటనలో రఘురామరాజు కూడా పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు ఆయన భీమవరం చేరుకోనున్నారు. గత కొంతకాలంగా వైసీపీని, ఆ పార్టీ అగ్రనాయకత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్న రఘురామపై రాష్ట్ర ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వస్తున్న తనను అరెస్ట్ చేయకుండా చూడాలని రఘురామ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం రఘురామ విషయంలో చట్టం ప్రకారం నడుచుకోవాలని పోలీసులను ఆదేశించింది.

విజయవాడ నుంచి భీమవరానికి హెలికాప్టర్‌లో రావాలని రఘురామరాజు తొలుత భావించారు. అయితే, మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు అందుకు అనుమతించలేదు. దీంతో ఈ రోజు ఢిల్లీ నుంచి విజయవాడకు విమానంలో చేరుకుని అక్కడి నుంచి కారులో భీమవరం వెళ్లనున్నారు. కాగా, ఎంపీ తనవెంట సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయవాదులను కూడా తీసుకొస్తున్నట్టు సమాచారం.

More Telugu News