Ukraine: కొన్ని రోజులైనా ఆనందంగా కలిసి బతుకుదాం... ఉక్రెయిన్ లో పెళ్లిళ్లు చేసుకుంటున్న వేలాది జంటలు!

  • రష్యా చేస్తున్న దాడితో అల్లకల్లోలంగా మారిన ఉక్రెయిన్
  • ఎవరు బతుకుతారో, ఎవరు చస్తారో తెలియని పరిస్థితి
  • చావే వస్తే.. భార్యాభర్తలుగా చనిపోవాలనుకుంటున్న జంటలు
Thousands of couples marrying in Ukraine

యుద్ధభూమిగా మారిన ఉక్రెయిన్ లో ప్రతి రోజు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏ క్షణంలో ఎక్కడ మిస్సైల్ పడుతుందో, బాంబుల వర్షం కురుస్తుందో, ఎవరు ప్రాణాలు కోల్పోతారో ఊహించలేని పరిస్థితి నెలకొంది. ఒక రోజు గడిస్తే... 'హమ్మయ్యా మన జీవితంలో మరో రోజు బతికాం' అని అక్కడి ప్రజలు సంతోషించే పరిస్థితి కొనసాగుతోంది. రష్యా చేస్తున్న దండయాత్రతో ఉక్రెయిన్ నామరూపాలు లేకుండా పోతోంది. యావత్ దేశం ఒక శ్మశానాన్ని తలపిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ శవాలు కనిపిస్తున్నాయి. 

రష్యా దాడులతో ఉక్రెయిన్ ప్రజల జీవితాలు అల్లకల్లోలంగా మారాయి. ఈ నేపథ్యంలో, పెద్ద సంఖ్యలో జంటలు పెళ్లి చేసుకుంటున్నాయి. ఏ క్షణంలో చస్తామో తెలియదు... బతికినన్నాళ్లు కలిసి సంతోషంగా బతుకుదామనే భావనతో వేలాది మంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోనే 4 వేల జంటలు పెళ్లి చేసుకున్నాయి. పరిస్థితులు చక్కబడితే కలిసి జీవనం కొనసాగిస్తామని... లేదంటే భార్యాభర్తలుగా కలిచి చనిపోతామని ఒక ప్రేమ జంట కేథరినా లైట్వినెంకో, ఇహోర్ జక్వాట్ స్కీ తీవ్ర భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. కీవ్ లోని ఒక చర్చిలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 

మరోవైపు దరఖాస్తు చేసుకున్న అదే రోజు వివాహం చేసుకునేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. గతంలో అయితే దరఖాస్తు చేసుకున్న నెల రోజుల తర్వాతే పెళ్లి చేసుకునే అవకాశం ఉండేది. ఇంకోవైపు ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లిన ఉక్రెయిన్ ప్రజలు కూడా స్వదేశానికి తిరిగొచ్చి వివాహబంధంతో ఒక్కటవుతున్నారు.

More Telugu News