India: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

  • గత 24 గంటల్లో 9,923 కేసుల నమోదు
  • ముందు రోజుతో పోలిస్తే 22.4 శాతం తగ్గిన కేసులు
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 79,313
India reports 9923 fresh cases

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కొత్తగా 9,923 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 7,293 మంది కోలుకోగా... 17 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 79,313 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే 22.4 శాతం కేసులు తగ్గాయి.

తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,33,19,396కి పెరిగింది. వీరిలో 4,27,15,193 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,24,890 మంది కరోనాకు బలయ్యారు. దేశంలో రికవరీ రేటు 98.61 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.55 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,96,32,43,003 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 13,00,024 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.  

తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికం కేరళ నుంచే వచ్చాయి. కేరళలో 2,786 కేసులు, మహారాష్ట్రలో 2,354 కేసులు, ఢిల్లీలో 1,060 కేసులు, తమిళనాడులో 686 కేసులు నమోదయ్యాయి.

More Telugu News