KCR: రాకేశ్ కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం: కేసీఆర్

  • అగ్నిపథ్ కు వ్యతిరేకంగా నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనలు
  • పోలీసు కాల్పుల్లో రాకేశ్ అనే యువకుడి మృతి
  • తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కేసీఆర్
KCR announces 25 laks and one job to Rakesh family

అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిన్న నిరసనకారులు చేపట్టిన ఆందోళన కార్యక్రమం హింసాత్మక రూపు దాల్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చోటు చేసుకున్న పోలీసు కాల్పుల్లో రాకేశ్ అనే యువకుడు మృతి చెందాడు. ఇతనిది వరంగల్ జిల్లా దబ్బీర్ పేట. అతని మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కుటుంబసభ్యలకు సంతాపాన్ని తెలియజేశారు. 

ఈ సందర్భంగా కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాకేశ్ కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారంతో పాటు, కుటుంబంలో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు, దుర్మార్గ విధానాలకు వెనుకబడిన తరగతుల బిడ్డలు బలికావడం తనను ఎంతగానో కలచి వేసిందని చెప్పారు. తెలంగాణ బిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటుందని అన్నారు. 

మరోవైపు నిన్నటి రైల్వే స్టేషన్ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యాధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. గాయపడిన మహబూబ్ నగర్ కు చెందిన శ్రీకాంత్ కుటుంబాన్ని ఫోన్ లో ఆయన పరామర్శించారు.

More Telugu News