Sensex: నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు!

  • 428 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 122 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3 శాతం పెరిగిన డాక్టర్ రెడ్డీస్ షేర్ విలువ
Markets ends in profits

నాలుగు రోజుల మార్కెట్ల నష్టాలకు ఈరోజు బ్రేక్ పడింది. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు సాయంత్రానికి పుంజుకున్నాయి. ఓవైపు ద్రవ్యోల్బణం భయాలు ఉన్నప్పటికీ మార్కెట్లు పుంజుకోవడం గమనార్హం. రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, భారతీ ఎయిర్ టెల్ తదితర కంపెనీలు మార్కెట్లను ముందుండి నడిపించాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 428 పాయింట్లు లాభపడి 55,320కి చేరుకుంది. నిఫ్టీ 122 పాయింట్లు పెరిగి 16,478కి ఎగబాకింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
డాక్టర్ రెడ్డీస్ (3.00%), రిలయన్స్ (2.73%), భారతి ఎయిర్ టెల్ (2.01%), సన్ ఫార్మా (1.36%), టెక్ మహీంద్రా (1.31%). 

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-3.81%), ఎన్టీపీసీ (-1.18%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.93%), బజాజ్ ఫైనాన్స్ (-0.91%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.89%).

More Telugu News