Konaseema District: వైసీపీ ఎంపీటీసీపై మంత్రి విశ్వ‌రూప్ కుమారుడి బెదిరింపులు... వైర‌ల్‌గా మారిన ఆడియో

  • అమ‌లాపురంలో అల్ల‌ర్ల కేసులో వైసీపీ ఎంపీటీసీ స‌త్తిబాబు అరెస్ట్‌
  • స‌త్తిబాబుకు ఫోన్ చేసి బెదిరించిన కృష్ణారెడ్డి
  • లీకైన ఫోన్ సంభాష‌ణ‌
ap minister viswarup son threatens own party mptc

ఏపీ మంత్రి పినిపే విశ్వ‌రూప్ కుమారుడు కృష్ణారెడ్డికి చెందిన‌దిగా భావిస్తున్న ఓ ఆడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. సొంత పార్టీ వైసీపీకి చెందిన ఎంపీటీసీని బెదిరిస్తూ కృష్ణారెడ్డి అస‌భ్య ప‌ద‌జాలాన్ని కూడా వాడారు. రెండు కాళ్లు విరిచేస్తాన‌ని, అంతు చూస్తానంటూ ఎంపీటీసీపై బెదిరింపుల‌కు దిగారు. ఇదంతా ఫోన్‌లోనే సాగింది. ఈ ఫోన్ సంభాష‌ణ‌కు సంబంధించిన ఆడియో బ‌య‌ట‌కు రాగా.. అది ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

ఇటీవ‌లే కోన‌సీమ జిల్లా పేరును అంబేద్క‌ర్ జిల్లాగా మారుస్తూ ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ అమ‌లాపురంలో పెద్ద ఎత్తున అల్ల‌ర్లు చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. ఈ అల్ల‌ర్ల‌లో మంత్రి విశ్వ‌రూప్‌, ఎమ్మెల్యే స‌తీశ్ ఇళ్ల‌ను నిర‌స‌న‌కారులు తగులబెట్టారు. ఈ కేసులో అరెస్టయిన‌ వారిలో వైసీపీ ఎంపీటీసీ అడ‌పా స‌త్తిబాబు కూడా ఉన్నారు. అల్ల‌ర్ల‌లో స‌త్తిబాబు ఉన్నార‌న్న విష‌యం తెలుసుకున్న కృష్ణారెడ్డి ఆయ‌న‌కు ఫోన్ చేసి అంతు చూస్తానంటూ బెదిరించారు.

More Telugu News