Venkatesh Daggubati: అందుకే నా ముఖం మీకు చూపించాను: రాజేంద్రప్రసాద్

  • ఈ నెల 27వ తేదీన విడుదలైన 'ఎఫ్ 3'
  • సందడిగా 'ఎఫ్ 3' బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్  
  • ఈ సినిమా హిట్ అవుతుందని ముందే చెప్పానన్న రాజేంద్రప్రసాద్ 
  •  నేడు కూడా ఈ సినిమా అన్ని చోట్లా ఫుల్స్ పడ్డాయని వ్యాఖ్య  
F3 movie update

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'ఎఫ్ 3' సినిమా, ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ను కొంతసేపటి క్రితం నిర్వహించారు. ఈ వేదికపై రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ .. "ఈ సినిమా హిట్ కాకపోతే నా ముఖం మళ్లీ మీకు చూపించనని ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజునే చెప్పాను. 

ఈ సినిమా హిట్ అయింది కనుకనే .. మళ్లీ మీ ముందుకు వచ్చాను. మామూలు హిట్ కాదు  .. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సోమవారం రోజున కూడా ఈ సినిమా అన్ని చోట్లా ఫుల్స్ పడ్డాయి. దీనిని హిట్ కాకపోతే ఏమంటారు? ఆ రోజున నేను అంత ధైర్యంగా మాట్లాడానికి కారణాలు రెండు .. ఒకటి నవ్వు .. రెండు మీరు. 

ఈ సినిమా రిలీజ్ రోజున నాకు ప్రపంచం నలు మూలాల నుంచి కాల్స్ వచ్చాయి. నాకు మళ్లీ 'మాయలోడు' రోజులు గుర్తుకు వచ్చాయి. 45 సంవత్సరాలుగా నవ్వునే నమ్ముకున్నాను. ఆ నవ్వే మళ్లీ నాకు మరో హిట్ ను తెచ్చిపెట్టింది. ఇంతటి సక్సెస్ కి కారణమైన అనిల్ రావిపూడికి హ్యాట్సాఫ్ చెబుతున్నాను" అన్నారు.

More Telugu News