Ayurveda: స్వీట్స్ భోజనానికి ముందా.. తర్వాతా.. ఆయుర్వేదం ఏమంటోంది?

  • స్వీట్ తో భోజనం ఆరంభించాలన్నది ఆయుర్వేదం సూచన
  • దీనివల్ల ముందే జీర్ణరసాల విడుదల మొదలవుతుంది
  • చివర్లో తీసుకుంటే అజీర్ణం, ఇతర సమస్యలు కలిగించొచ్చు
Why Ayurveda recommends consuming sweets before meals

భోజనం చివర్లో స్వీట్స్ తినడం మంచిదన్న ఒక సూచన ఎప్పుడో ఒక్కసారి అయినా వినే ఉంటారు. పది మందిని పిలిచి పెట్టే భోజనాలలో స్వీట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే కొందరు భోజనం ప్రారంభించడానికి ముందుగా స్వీట్ తింటుంటారు. వారిని చూసి ఆరాటం ఆగడం లేదని ఇతరులు నవ్వుకుంటుంటారు. ఎక్కువ మంది పెరుగన్నానికిముందో.. లేదంటే చివర్లో స్వీట్ తిని ముగిస్తుంటారు. మరి ఆయుర్వేదం స్వీట్ ను ఎప్పుడు తీసుకోవాలని చెప్పింది..? దీనికి ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ నిఖిత కోహ్లి వివరంగా చెప్పారు.

భోజనాన్ని మిఠాయితో ప్రారంభించాలని ఆయుర్వేదం చెప్పిందని.. దీనివల్ల జీర్ణ క్రియ సాఫీగా ఉండడమే కాకుండా మంచి పోషకాలు కూడా అందుతాయని ఆమె వివరించారు. స్వీట్లను మనం ఏ సమయంలో తీసుకుంటున్నామనే దాని ఆధారంగా అది జీవశక్తిని ఇస్తుందా? లేదా హాని కలిగిస్తుందా? అన్నది ఆధారపడి ఉంటుందని చెప్పారు. 

‘‘స్వీట్లను అరిగించడానికి జీర్ణాశయం ఎక్కువ సమయం తీసుకుంటుంది. భోజనానికి ముందుగా స్వీట్ ను తినడం వల్ల జీర్ణరసాల విడుదల ముందే  మొదలవుతుంది. దాంతో ఆహారం మంచిగా జీర్ణమయ్యేందుకు సాయపడుతుంది. అదే భోజనం చివర్లో స్వీట్స్ ను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ నిదానిస్తుంది’’ ఆమె వివరించారు. 

ఇక భోజనానికి ఆరంభంలో స్వీట్స్ తినడం వల్ల రుచి మొగ్గలు విచ్చుకుంటాయని డాక్టర్ నిఖిత వివరించారు. అలా కాకుండా చివర్లో తినడం వల్ల జీర్ణాగ్ని కలిగిస్తుందని, ఆమ్ల స్రావాలు విడుదలకు దారితీయవచ్చని, ఇది అజీర్ణం కలిగించొచ్చని ఆమె చెప్పారు. భోజనం చివర్లో షుగర్ తీసుకున్నా గ్యాస్, కడుపు ఉబ్బరం కలిగించొచ్చని తెలిపారు.  

More Telugu News