Konaseema District: కోన‌సీమ అల్ల‌ర్ల‌పై బీఎస్పీ తెలంగాణ క‌న్వీన‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ స్పంద‌న ఇదే!

  • అంబేద్కర్ పేరు పెట్టడంపై కోన‌సీమ జిల్లాలో అల్ల‌ర్లు
  • ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించిన ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌
  • గాంధీ, నెహ్రూల పేర్ల‌పై బ‌డుగులు మౌనంగానే ఉన్నారంటూ వ్యాఖ్య 
  • అంబేద్కర్ పేరు ఎలా వ్య‌తిరేకిస్తార‌న్న ప్ర‌వీణ్‌
rs praveen kumar response on konaseema clashes

కోన‌సీమ జిల్లాలోని అమ‌లాపురం కేంద్రంగా మంగ‌ళ‌వారం చోటుచేసుకున్న అల్ల‌ర్లు ఇప్పుడు తెలుగు రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయాయి. అమ‌లాపురం అల్ల‌ర్లు మీ ప‌నేనంటూ విప‌క్షాలు ఆరోపిస్తుంటే.. కాదు అవి విప‌క్షాల ప‌నేనంటూ వైసీపీ ప్ర‌తిస్పందిస్తోంది. ఇలాంటి నేప‌థ్యంలో బీఎస్పీ తెలంగాణ క‌న్వీన‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ బుధ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. 

దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన నాటి నుంచి ప్ర‌భుత్వాలు అన్ని స్కీములు, రోడ్లు, పార్కులు, డ్యాంల‌కు గాంధీ, నెహ్రూల పేర్లు పెట్టినా జ‌నాభాలో 90 శాతం మంది ఉన్న బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాలు మౌనంగానే ఉన్నాయ‌ని ప్ర‌వీణ్ కుమార్ తెలిపారు. ఇప్పుడు కేవ‌లం ఒక కోన‌సీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్క‌ర్ పేరు పెడితేనే ఎలా వ్య‌తిరేకిస్తున్నారంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ దిశ‌గా చాలా లెక్క‌లే తేలాల్సి ఉన్నాయంటూ ఆయ‌న ట్వీట్ చేశారు.

More Telugu News