Janasena: రుద్ర‌వీణ చిత్రంలోని ఈ పాట‌లోని పంక్తులు న‌న్నెంతో ప్ర‌భావితం చేశాయి: ప‌వన్ క‌ల్యాణ్‌

  • 1988లో వ‌చ్చిన రుద్ర‌వీణ‌
  • చిరంజీవిని మ‌రో మెట్టు ఎక్కించిన సినిమా
  • ఆ చిత్రంలోని పాట‌ను ప్ర‌స్తావించిన ప‌వ‌న్‌
  • ఆ పాట పంక్తులు త‌న‌నెంతో ప్ర‌భావితం చేశాయ‌ని వెల్ల‌డి
pawan kalyan remembers his brother chiranjeevi cinema rudraveena

మెగాస్టార్ చిరంజీవి సినీ ప్ర‌స్థానంలో రుద్ర‌వీణ చిత్రం ఓ ప్ర‌త్యేక చిత్రంగానే నిలుస్తుంది. 1988లో దిగ్గజ ద‌ర్శ‌కుడు కె.బాల‌చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో చిరంజీవి న‌టన అద్భుత‌మ‌నే చెప్పాలి. ఇక సినిమాలోని మాట‌లు గానీ, పాట‌లు గానీ ప్రేక్ష‌కుడిని ఇట్టే ఆక‌ట్టుకున్నాయి. నాటి ఆ సినిమాను ప్ర‌స్తావిస్తూ చిరంజీవి సోద‌రుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సోమ‌వారం ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. 

రుద్ర‌వీణ సినిమాలోని 'చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా' పాటలోని పంక్తులు త‌న‌నెoతో ప్రభావితం చేశాయని ఆయ‌న‌ పేర్కొన్నారు. 'నువ్వుతినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది.. గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచింది.. ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా.. తెప్ప తగల బెట్టేస్తావా ఏరు దాటగానే? అన్న పంక్తులు తనను అమితంగా ప్రభావితం చేశాయని ఆయ‌న వెల్ల‌డించారు.

More Telugu News