YSRCP: వివేకా హ‌త్య కేసు నిందితుల బెయిల్ పిటిష‌న్లపై విచార‌ణ జూన్ 13కి వాయిదా

  • బెయిల్ కోసం హైకోర్టులో వివేకా హ‌త్య కేసు నిందితుల పిటిషన్లు
  • ఇప్ప‌టికే రెండు సార్లు విచారించిన హైకోర్టు
  • ఫోరెన్సిక్ నివేదిక‌లు రావాల్సి ఉందంటూ సీబీఐ వాద‌న‌లు
  • పిటిష‌న్ల‌పై రెగ్యుల‌ర్ కోర్టులో విచారిస్తామ‌న్న హైకోర్టు
ap high court adjourned hearing on ys vivekananda reddy accused bail petitions

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు నిందితుల బెయిల్ పిటిష‌న్ల‌పై విచార‌ణ‌ను జూన్ 13కు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న శివ‌శంక‌ర్‌రెడ్డి, ఉమా శంక‌ర్ రెడ్డి, సునీల్ కుమార్ యాద‌వ్‌లు త‌మ‌కు బెయిల్ ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. 

ఈ పిటిష‌న్ల‌పై ఇప్ప‌టికే రెండు సార్లు విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు.. గ‌త విచార‌ణ సంద‌ర్భంగా ఎప్ప‌టిలోగా ఈ కేసు ద‌ర్యాప్తును సీబీఐ పూర్తి చేస్తుంద‌ని ప్ర‌శ్నించింది. గురువారం నాటి విచార‌ణ సంద‌ర్భంగా సీబీఐ త‌ర‌ఫు న్యాయ‌వాది ఫోరెన్సిక్ నివేదిక‌లు రావాల్సి ఉంద‌ని, దీంతో ఈ కేసు ద‌ర్యాప్తు ఎప్ప‌టిలోగా పూర్తి అవుతుంద‌న్న విష‌యం ఇప్పుడే చెప్ప‌లేమ‌ని తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు... ఈ పిటిష‌న్ల‌పై ఇక రెగ్యుల‌ర్ కోర్టులోనే విచారిస్తామ‌ని చెప్పి... తదుప‌రి విచార‌ణ‌ను జూన్ 13కు వాయిదా వేసింది.

More Telugu News