Junior NTR: దూసుకుపోతున్న 'కొమరమ్ భీముడో' ఫుల్ సాంగ్ .. చూసేయండి!

  • వసూళ్ల పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్'
  • సక్సెస్ లో ప్రధాన పాత్ర పోషించిన కీరవాణి పాటలు 
  • పూర్తి స్థాయిలో రిలీజ్ చేసిన 'కొమరం భీమ్' పాట 
  • యూ ట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన సాంగ్
RRR movie update

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాలోని ప్రతి పాట దేనికదే ప్రత్యేకతను .. ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుంది. 

ప్రతి పాట కూడా సందర్భంలో ఒదిగిపోతూ ప్రేక్షకుల మనసులలో ఇమిడిపోతుంది. అలాంటి పాటల వీడియోలను ఒక్కొక్కటిగా పూర్తిస్థాయిలో విడుదల చేస్తూ వస్తున్నారు. అలా తాజాగా ఈ సినిమా నుంచి 'కొమరం భీముడో' సాంగును రిలీజ్ చేశారు. కాలభైరవ ఆలపించిన ఈ పాట కథాపరంగా కదిలించివేస్తుంది.

 ఈ పాటను  రిలీజ్ చేసి 24 గంటలు కూడా కాకముందే 4 మిలియన్ కి పైగా వ్యూస్ ను .. 3 లక్షలకు పైగా లైక్స్ ను సాధించింది. యూ ట్యూబ్ లో ఈ సాంగ్ నెంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ లో నిలిచింది. ఇంకా ఈ సాంగ్ ఏ స్థాయిలో తన స్పీడ్ పెంచుతుంతో .. ఏ రేంజ్ లో రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.

More Telugu News