MS Dhoni: వచ్చే ఐపీఎల్ సీజన్ లో తాను ఆడడంపై ధోనీ ఏమన్నాడంటే...!

  • తాజా సీజన్ లో మళ్లీ చెన్నై పగ్గాలందుకున్న ధోనీ
  • కెప్టెన్సీ నుంచి తప్పుకున్న జడేజా
  • ఇవాళ సన్ రైజర్స్ తో చెన్నై పోరు
  • టాస్ కు వచ్చిన ధోనీ
  • 2023లోనూ చెన్నైకు ఆడతానని క్లారిటీ
Dhoni opines on future with CSK

ఎంఎస్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అంటూ ఈ సీజన్ ప్రారంభానికి ముందు వినిపించింది. అందుకు తగ్గట్టుగానే ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని వదిలేయడం, ధోనీ వారసుడిగా రవీంద్ర జడేజా పగ్గాలు అందుకోవడం జరిగాయి. కానీ సగం టోర్నీ ముగిసేసరికి చెన్నై జట్టు ఘోరమైన ఆటతీరుతో పాయింట్ల పట్టికలో దిగువన నిలిచింది. 8 మ్యాచ్ లు ఆడి ఆరింట ఓడిపోయింది. దాంతో కెప్టెన్సీ తన వల్లకాదంటూ జడేజా వైదొలగడం, ధోనీ మళ్లీ చెన్నై కెప్టెన్ గా నియమితుదవడం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో, ఇవాళ సన్ రైజర్స్ తో పోరులో టాస్ సందర్భంగా ధోనీ తన భవిష్యత్తుపై స్పష్టత ఇచ్చాడు. వచ్చే సీజన్ లో కూడా ఆడతానని, 2023లోనూ తనను చెన్నై సూపర్ కింగ్స్ పసుపు జెర్సీలోనే చూస్తారని వెల్లడించాడు. 

టోర్నీలో ప్రస్తుతం చెన్నై జట్టు ఆడుతున్న తీరును సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాడు. అనేక క్యాచ్ లు వదిలేశామని, ఫీల్డింగ్ మెరుగుపర్చుకోవడం అత్యావశ్యకం అని ధోనీ స్పష్టం చేశాడు. అంతేకాదు, బ్యాటింగ్, బౌలింగ్ అంశాల్లో కూడా ఉదాసీనంగా ఆడితే కష్టమని సహచరులకు హెచ్చరిక చేశాడు.

More Telugu News