Osmania University: ఓయూలో రాహుల్ స‌భ‌కు అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

  • మే 6న తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు రాహుల్ గాంధీ
  • 7న హైద‌రాబాద్‌కు కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షుడు
  • ఓయూలో రాహుల్ స‌భ‌కు గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ నిరాక‌ర‌ణ‌
no permissiontorahul gandhi meeting in osmania university

తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు రానున్న కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివ‌ర్సిటీలో స‌భ నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి ఇవ్వాల‌న్న కాంగ్రెస్ పార్టీ విన‌తి తిర‌స్క‌ర‌ణ‌కు గురైంది. ఈ మేర‌కు కాంగ్రెస్ పార్టీ విన‌తిని తిర‌స్క‌రిస్తున్న‌ట్లు ఓయూ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ శ‌నివారం నాడు ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. 

మే 6న తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు రానున్న రాహుల్ గాంధీ అదే రోజున వ‌రంగ‌ల్‌లో నిర్వ‌హించ‌నున్న బ‌హిరంగ స‌భ‌కు హాజ‌ర‌వుతారు. ఆ మ‌రునాడు హైద‌రాబాద్‌లో ఆయ‌న పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌తో స‌మావేశం కానున్నారు. ఈ సంద‌ర్భంగా ఓయూలోనూ రాహుల్ గాంధీ కోసం ఓ స‌భ నిర్వ‌హిస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ యూనివ‌ర్సిటీ అధికారుల‌ను కోరింది. ఈ ప్ర‌తిపాద‌న‌పై సుధీర్ఘంగా ఆలోచ‌న చేసిన ఓయూ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ రాహుల్ గాంధీ స‌భ‌కు అనుమ‌తిని నిరాక‌రిస్తూ ప్ర‌క‌ట‌న జారీ చేసింది.

More Telugu News