KIMS: మెడిక‌ల్ కాలేజీ హాస్ట‌ల్‌లో ఫుడ్ పాయిజ‌నింగ్‌... 50 మంది విద్యార్థినుల‌కు అస్వ‌స్థ‌త‌

  • అమ‌లాపురం ప‌రిధిలోని కిమ్స్ న‌ర్సింగ్ కాలేజీలో ఘ‌ట‌న‌
  • బీఎస్సీ న‌ర్సింగ్ విద్యార్థుల‌కు అస్వ‌స్థ‌త‌
  • ఫుడ్ పాయిజ‌నింగే కార‌ణ‌మ‌ని నిర్ధార‌ణ‌
  • బాధితుల‌కు కిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స‌

కోన‌సీమ జిల్లాలోని అమలాపురం ప‌రిధిలో ఉన్న కిమ్స్ మెడిక‌ల్ కాలేజీలో గురువారం ఫుడ్ పాయిజ‌నింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మెడికల్ కాలేజీకి అనుబంధంగా న‌ర్సింగ్ క‌ళాశాల కూడా కొన‌సాగుతోంది. న‌ర్సింగ్ క‌ళాశాల‌కు చెందిన హాస్ట‌ల్‌లో గురువారం మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన బీఎస్సీ న‌ర్సింగ్ సెకండియ‌ర్ చ‌దువుతున్న విద్యార్థినులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.

వారు తిన్న ఆహారం విష‌పూరిత‌మైంద‌ని గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌లో 50 మంది దాకా విద్యార్థినులు అస్వస్థ‌త‌కు గుర‌య్యారు. వీరంద‌రినీ హుటాహుటీన కిమ్స్ ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఒకేసారి 50 మంది విద్యార్థులు అస్వస్థ‌త‌కు గురి కావ‌డంతో కాలేజీ యాజ‌మాన్యం ఆందోళ‌న‌కు గురైంది. ఘ‌ట‌న‌పై అంత‌ర్గ‌త విచార‌ణ‌కు ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News