Nizamabad District: నిజామాబాద్ బీజేపీ నేతల్లో విభేదాలు.. ధన్‌పాల్‌ను నెట్టేసిన యెండల లక్ష్మీనారాయణ

  • హనుమజ్జయంతి వేడుకల సందర్భంగా బయటపడిన విభేదాలు
  • ఎంపీ అర్వింద్ వస్తున్నారు ఆగమన్న ధన్‌పాల్
  • ఆయన వచ్చేదీ లేదు, చేసేదీ లేదన్న యెండల
  • బాహాబాహీకి దిగిన ఇరు వర్గాలు
Differences in Nizamabad BJP leaders

హనుమజ్జయంతి వేడుకల సందర్భంగా నిజామాబాద్ బీజేపీ నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలు బయటపడ్డాయి. నగరంలో నిన్న ఉదయం 11 గంటలకు హనుమంతుడి శోభాయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే, ఎంపీ ధర్మపురి అర్వింద్ వస్తున్నారని, కాసేపు ఆగాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా కోరారు. 

కల్పించుకున్న మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ.. ‘ఆయన వచ్చేదీ లేదు, చేసేదీ లేదు’ అనడంతో ధన్‌పాల్, యెండల వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఈ క్రమంలో ధన్‌పాల్‌ను యెండల నెట్టేడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా, ఈ రెండు వర్గాలు ఒక్కటైనట్టు చెబుతూ బీజేపీ వర్గాలు గత రాత్రి ఓ వీడియోను విడుదల చేశాయి.

More Telugu News