India: పెరుగుతున్న ఫోర్త్ వేవ్ భయాలు.. ఇండియా కరోనా అప్డేట్స్ ఇవిగో!

  • గత 24 గంటల్లో 975 కొత్త కేసుల నమోదు
  • దేశ వ్యాప్తంగా నలుగురి మృతి
  • ముందు రోజుతో పోలిస్తే పెరిగిన యాక్టివ్ కేసులు
India corona updates

మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులతో చైనాలోని దాదాపు అన్ని నగరాలు తీవ్ర కోవిడ్ ఆంక్షలను ఎదుర్కొంటున్నాయి. పలు నగరాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. మరోవైపు భారత్ లో కూడా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్, జులై నెలల్లో నాలుగో వేవ్ రావొచ్చనేది ఒక అంచనా. 

ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో భారత్ లో 975 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు కొత్త కేసుల సంఖ్య 949గా ఉంది. ఇదే సమయంలో 796 మంది కోలుకోగా, నలుగురు మృతి చెందారు. దేశంలో 11,366 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముందు రోజుతో పోలిస్తే యాక్టివ్ కేసుల సంఖ్య మరో 175 పెరగడం గమనార్హం. ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే... నిపుణులు అంచనా వేసిన విధంగా మరో వేవ్ వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం. 

మరోవైపు ఇప్పటి వరకు దేశంలో 4,25,07,834 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 186.38 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను వేశారు. రోజువారీ పాజిటివిటీ రేటు 3.95 శాతానికి పెరిగింది. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రెండో దేశంగా భారత్ ఉంది. ఇండియాలో ఇప్పటి వరకు 4,30,39,972 కేసులు నమోదయ్యాయి.

More Telugu News