Sensex: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 566 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 149 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • మూడున్నర శాతం నష్టపోయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ విలువ
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. రష్యాపై అమెరికా, ఐరోపా సమాఖ్య విధించిన తాజా ఆంక్షలు, చైనాలోని షాంఘైలో లాక్ డౌన్ విధింపు తదితర కారణాలు మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి. ఈ నేపథ్యంలో ఈరోజు రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 566 పాయింట్లు నష్టపోయి 59,610కి పడిపోయింది. నిఫ్టీ 149 పాయింట్లు కోల్పోయి 17,807 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (2.61%), టాటా స్టీల్ (1.94%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.52%), భారతి ఎయిర్ టెల్ (1.17%), నెస్లే ఇండియా (1.10%).

టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-3.51%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-3.26%), హెచ్సీఎల్ (-2.07%), టెక్ మహీంద్రా (-1.97%), ఇన్ఫోసిస్ (-1.75%).

More Telugu News