Chiranjeevi: సుకుమార్‌తో యాడ్ ఫిలిం చేసిన చిరంజీవి.. ఫొటోలు ఇవిగో

  • దర్శకుడుగా సుకుమార్ ప్రతిభ అందరికీ తెలిసిందే
  • శుభగృహ రియల్ ఎస్టేట్ కోసం వాణిజ్య ప్రకటన   
  • చాలా ఎంజాయ్‌ చేశానన్న చిరు
chiru with sukumar

సినీ ద‌ర్శ‌కుడు సుకుమార్‌తో ఫొటోలు దిగి పోస్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఓ రియ‌ల్ ఎస్టేట్ సంస్థకు చెందిన యాడ్‌ను రూపొందిస్తోన్న క్ర‌మంలో చిరు, సుకుమార్ క‌లిసి ఈ ఫొటోలు తీసుకున్నారు. 

                        
'దర్శకుడుగా సుకుమార్ ప్రతిభ అందరికి తెలిసిందే. ఓ యాడ్ ఫిల్మ్ కోసం, వారి దర్శకత్వంలో షూటింగ్ జ‌ర‌గ‌డాన్ని నేను చాలా ఎంజాయ్‌ చేశాను. ఈ యాడ్ నిర్మించిన శుభగృహ రియల్ ఎస్టేట్ వారికి శుభాభినందనలు' అని చిరంజీవి పేర్కొన్నారు. 

                    
కాగా, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి న‌టించిన 'ఆచార్య' సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. అలాగే, 'పుష్ప' పార్ట్ 1 సినిమాతో హిట్ కొట్టిన సుకుమార్ ఇప్పుడు 'పుష్ప' పార్ట్-2 కు సంబంధించిన ప‌నుల‌ను చూసుకుంటుకున్నారు.

More Telugu News