Kamareddy District: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. నుజ్జునుజ్జయిన కారు.. ఐదుగురి మృతి

  • మాచారెడ్డి మండలం ఘన్‌పూర్(ఎం) వద్ద ప్ర‌మాదం 
  • మరొకరికి తీవ్ర గాయాలు
  • బస్సు టైరు పేలడం వ‌ల్లే యాక్సిడెంట్‌
road accident in kama reddy

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్‌పూర్(ఎం) వద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రొక‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. ఓ కారును ఆర్టీసీ బస్సు ఢీ కొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌పై స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు స‌హాయక చ‌ర్యల్లో పాల్గొన్నారు. సిరిసిల్ల వైపు నుంచి కరీంనగర్-1 డిపో బస్సు కామారెడ్డికి వెళ్తున్న స‌మ‌యంలో ఈ ప్రమాదం జరిగిందని వారు వివ‌రించారు. 

ఈ ఘ‌ట‌న‌లో కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక బాలుడు ఉన్నాడు. కారులోని మరో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెకు ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స అందుతోంది. బస్సు టైరు పేలి అదుపు త‌ప్ప‌డం వ‌ల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. 

More Telugu News