Nagashourya: నాగశౌర్య సినిమా నుంచి వచ్చేస్తున్న టీజర్!

  • అనీశ్ కృష్ణ నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ 
  • సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్
  • ఈ నెల 28వ  తేదీన టీజర్ రిలీజ్ 
  • ఏప్రిల్ 22వ తేదీన సినిమా విడుదల  
Krishna Vrinda Vihari Movie Teaser Will Release on March 28th

నాగశౌర్య హీరోగా దర్శకుడు అనీశ్ కృష్ణ 'Krishna Vrinda Vihari' సినిమాను రూపొందిస్తున్నాడు. నాగశౌర్య సొంత బ్యానర్ అయిన 'ఐరా' క్రియేషన్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. లవ్ తో కూడిన ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ కథ నడుస్తుంది. 

ఈ సినిమాలో నాగశౌర్య సరసన నాయికగా 'షిర్లే సెటియా' పరిచయం కానుంది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన పోస్టర్లు ఆసక్తిని పెంచాయి. టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 28వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటిస్తూ, అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు.

రాధిక ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా ఉంటుందని అంటున్నారు. ఏప్రిల్ 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ మధ్య కాలంలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న నాగశౌర్యకి ఈ సినిమా ఊరటనిస్తుందేమో చూడాలి.

More Telugu News