Kamal Haasan: 'విక్రమ్' భారీతనాన్ని పెంచుతున్న కమల్!

  • 'విక్రమ్'గా కమలహాసన్
  • కీలకమైన పాత్రలో అమితాబ్ 
  • దర్శకుడిగా లోకేశ్ కనగరాజ్ 
  • జూన్  3వ తేదీన వివిధ భాషల్లో రిలీజ్  
Vikram Movie Update

కమలహాసన్ కథానాయకుడిగా ఆయన సొంత బ్యానర్లో 'విక్రమ్' సినిమా రూపొందుతోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి  .. ఫహాద్ ఫాజిల్ .. నరేన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.  

అయితే ఇప్పటివరకూ ఈ సినిమా టీమ్ సస్పెన్స్ లో ఉంచిన ఒక విషయం తాజాగా బయటికి వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. సెకండాఫ్ లో ఆయన పాత్ర ఎంట్రీ ఉంటుందని చెబుతున్నారు.

ఇంతవరకూ కమల్ ఎన్నో ప్రయోగాలు చేస్తూ వచ్చారు. ఆ జాబితాలో ఈ సినిమా చేరుతుందని అంటున్నారు. జూన్ 3 వ తేదీన తమిళంతో పాటు  తెలుగు .. మలయాళ .. కన్నడ ..  హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో కమల్ మరోసారి భారీ హిట్ అందుకుంటారేమో చూడాలి.

More Telugu News