Jagan: అందుకే ఆయన ఇంటి పేరుగా 'నారా' బదులు 'సారా' పెట్టుకుంటే బాగుంటుంది: జగన్

  • చంద్రబాబు హయాంలో 254 బ్రాండ్లకు అనుమతిని ఇచ్చారు
  • 2019 తర్వాత ఒక్క మద్యం బ్రాండ్ కు కూడా అనుమతిని ఇవ్వలేదు
  • టీడీపీ నేతలవి క్రిమినల్ బ్రెయిన్స్ అన్న సీఎం  
Jagan fires on Chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబుపై ముఖ్యమంత్రి జగన్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో మద్యం పాలసీపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలోనే 254 బ్రాండ్లకు అనుమతిని ఇచ్చారని చెప్పారు. ఈ బ్రాండ్లన్నీ చంద్రన్న కానుకలేనని అన్నారు. 2019 తర్వాత ఏపీలో కొత్తగా ఒక్క మద్యం బ్రాండ్ కు కూడా అనుమతిని ఇవ్వలేదని చెప్పారు.

 స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్ వంటి బ్రాండ్లు ఉన్నట్టు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 కొత్త జిల్లాలు, మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చామని, చంద్రబాబు మాత్రం 14 డిస్టిలరీలకు అనుమతి ఇచ్చారని అన్నారు. అందుకే ఆయన ఇంటి పేరును 'నారా' బదులు 'సారా' అని పెట్టుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. 

తెలుగుదేశం పార్టీ నేతలవి క్రిమినల్ బ్రెయిన్స్ అని జగన్ అన్నారు. జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలేనని విమర్శించారు. పార్టీ పరంగా టీడీపీ, మీడియా పరంగా ఎల్లో మీడియా చీప్ బ్రాండ్స్ అని అన్నారు. వీరంతా మహిళా వ్యతిరేకులని చెప్పారు. ఏపీలో చీప్ లిక్కరే లేదని... తక్కువ ధరకు దొరుకుతున్న మద్యం మాత్రమే ఉందని అన్నారు.

More Telugu News