Allu Arjun: 'పుష్ప 2' మొదటి షెడ్యూల్ ను మార్పు చేశారట!

  • సంచలన విజయాన్ని సాధించిన 'పుష్ప'
  • బన్నీ కెరియర్లోనే భారీ వసూళ్లు 
  • 'పుష్ప 2' కోసం మొదలైన సన్నాహాలు 
  • సెట్స్ పైకి వెళ్లడానికి మరింత సమయం   
Pushpa 2 movie update

'పుష్ప' సంచలన విజయాన్ని సాధించింది. బన్నీ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. హిందీలో ఈ సినిమా 100 కోట్లకి పైగా వసూళ్లను తెచ్చింది. కథాకథనాలు .. సుకుమార్ టేకింగ్ ..  పాత్రలను మలిచిన తీరు .. పాటలు ఇవన్నీ కూడా ఈ సినిమా విషయంలో ముఖ్యమైన పాత్రను పోషించాయి. 

ఇక ఇప్పుడు అందరి దృష్టి 'పుష్ప 2' పైనే ఉంది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా మొదటి షెడ్యూల్ మొదలవుతుందని చెప్పారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో బన్నీ ఉన్నాడని అన్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా షూటింగు వాయిదా పడిందనే టాక్ వినిపిస్తోంది. 

మే నెలలో గానీ .. జూన్ లో గాని ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. మరి అదే నిజమైతే ముందుగా అనుకున్నట్టుగా ఈ సినిమాను ఈ ఏడాదిలో విడుదల చేయడం కష్టమే అవుతుందేమో. ఇక ఈ సినిమాలో ముందు పార్ట్ కు మించి ఫైట్లు ఉండాలని బన్నీ చెప్పినట్టుగా తెలుస్తోంది.

More Telugu News