Imran Khan: ప్రభుత్వానికి అండగా నిలవాలని ప్రజలను కోరిన ఇమ్రాన్ ఖాన్

  • ఇస్లామోఫోబియాపై ఐక్యరాజ్యసమితిలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టానన్న ప్రధాని  
  • మార్చి 15న ఇస్లామోఫోబియా వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకున్నారు
  • ప్రతిపక్షాలు దేశాన్ని దోచుకుంటున్నాయన్న ఇమ్రాన్ 
Imran Khan seeks pakistan peoples support for his government

పాకిస్థాన్ లోని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఇమ్రాన్ ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కోబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు ఇమ్రాన్ ఒక విన్నపం చేశారు. ప్రజలంతా తమ ప్రభుత్వానికి అండగా నిలబడాలని కోరారు.

ఓ బహిరంగ సభలో ఇమ్రాన్ మాట్లాడుతూ, ఇస్లామోఫోబియా విషయంలో ఐక్యరాజ్యసమితిలో తాను ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టానని... అయితే దీనికి అనుగుణంగా మార్చి 15న ఇస్లామోఫోబియా వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకున్నారని చెప్పారు. 

గతంలో ఇస్లామోఫోబియా గురించి మాట్లాడటానికి కూడా ఏ నాయకుడు సాహసించేవాడు కాదని అన్నారు. మాజీ ప్రధాని కూడా దీని గురించి మాట్లాడేవారు కాదని... వీరంతా పశ్చిమ దేశాలకు బానిసలని మండిపడ్డారు. ప్రతిపక్షాలు దేశాన్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు.

More Telugu News