Pakistan: సంక్షోభంలో ఇమ్రాన్ ఖాన్ సర్కారు.. భవిష్యత్తును తేల్చనున్న భాగస్వామ్య పక్షాలు

  • ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం
  • నెలాఖరులో దీనిపై ఓటింగ్  
  • 7 సీట్ల మెజారిటీతో నెగ్గుకొస్తున్న ఇమ్రాన్
Key ally of Pakistan PM Imran Khan says he is  in Trouble

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ పదవికి గండం ఏర్పడింది. ప్రతిపక్షాలు ఇమ్రాన్ సర్కారు తీరును వ్యతిరేకిస్తూ జాతీయ అసెంబ్లీలో (పార్లమెంటు దిగువ సభ) అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం తెలిసిందే. దీనిపై ఈ నెల చివర్లో ఓటింగ్ జరగనుంది. 28 నుంచి 30వ తేదీ మధ్య ఓటింగ్ ఉండొచ్చని తెలుస్తోంది.

పార్లమెంటు లో కేవలం 7 సీట్ల మెజారిటీతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇమ్రాన్ ఖాన్ నడుపుతున్నారు. చౌదరి పర్వేజ్ ఇలాహి ఆధ్వర్యంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ కు ఐదుగురు సభ్యుల బలముంది. అలాగే, బెలూచిస్థాన్ అవామీ పార్టీకి ఐదు సీట్లు, ముత్తహిదా క్వామి మూవ్ మెంట్ పాకిస్థాన్ కు ఏడుగురు సభ్యులున్నారు. ఈ మూడు పక్షాలు (17 మంది) అవిశ్వాస తీర్మానంపై నిర్ణయం తీసుకోనున్నాయి. 

తాము ఉమ్మడిగా చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామని ఇలాహి తాజాగా ప్రకటించారు. అంతేకాదు ఇమ్రాన్ ఖాన్ కు ఆయన హెచ్చరిక కూడా పంపారు. ‘‘ఇమ్రాన్ ఖాన్ తన భాగస్వామ్య పక్షాలను నేరుగా సంప్రదించి, సంకీర్ణ సర్కారులోనే కొనసాగాలంటూ నచ్చజెప్పాలా? లేదా? అన్నది ఆయనే నిర్ణయించుకోవాలి. కానీ, ఆయన (ఇమ్రాన్) 100 శాతం సంక్షోభంలో ఉన్నారు’’ అని ఇలాహి ప్రకటించారు.

More Telugu News