Pavan Kalyan: నిజంగానే నేను చాలా హర్ట్ అయ్యాను: సంయుక్త మీనన్ చమత్కారం

  • 'భీమ్లా నాయక్'గా పవన్ కల్యాణ్ 
  • వసూళ్ల పరంగా కొత్త రికార్డుల నమోదు 
  • నిత్యామీనన్ అలిగినట్టుగా ప్రచారం 
  • గడుసుగా సమాధానమిచ్చిన సంయుక్త మీనన్   
Bheemla Nayak movie update

పవన్ కల్యాణ్ తాజా చిత్రంగా థియేటర్లకు వచ్చిన 'భీమ్లా నాయక్' వసూళ్ల పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. చాలా వేగంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన ఈ సినిమా, అదే స్థాయిలో తన జోరును చూపుతోంది. ఈ సినిమాలో పవన్ సరసన నాయికగా నిత్యామీనన్ నటిస్తే, రానా జోడీగా సంయుక్త మీనన్ అలరించింది. 

ఈ సినిమాలో తన పాత్రకి సంబంధించిన హిట్ సాంగ్ తో పాటు, కొన్ని సీన్స్ లేపేశారని నిత్యామీనన్ అలిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక తనకి సంబంధించిన సీన్స్ కూడా బాగానే కోతకి గురయ్యాయని సంయుక్త మీనన్ కి కూడా కోపాలు వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై ఆమె స్పందించింది. 

"నేను చాలా హర్ట్ అయ్యాననే మాట వాస్తవమే. అయితే నా పాత్ర గురించి కాదు .. దాని నిడివి గురించి కాదు. ఈ సినిమాను రెండోసారి థియేటర్లో చూద్దామనుకుంటే ఇంతవరకూ టిక్కెట్ దొరకలేదు .. అందుకు" అంటూ చమత్కరించింది. మొత్తానికి సంయుక్త గడుసు పిండమే. ఆ సంగతి చాలామందికి ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజునే అర్థమైపోయింది కూడా.

More Telugu News