CM Jagan: భోగాపురం ఎయిర్ పోర్టుకు క్లియరెన్సు కోసం ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం జగన్

  • పౌర విమానయాన శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖలకు కూడా లేఖలు
  • భోగాపురం త్వరగా పూర్తయ్యేలా చూడాలని వినతి
  • గతంలో ఇచ్చిన అనుమతి ముగిసిందని వెల్లడి
  • సైట్ క్లియరెన్స్ పునరుద్ధరించాలని విజ్ఞప్తి
CM Jagan wrote PM Modi for site clearance of Bhogapuram airport

ఏపీ సీఎం జగన్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, రక్షణ శాఖలకు లేఖలు రాశారు. భోగాపురం ఎయిర్ పోర్టు అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామిని గుర్తించిందని, త్వరితగతిన సైట్ క్లియరెన్స్ అనుమతి పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో పౌరవిమానయాన శాఖ జారీ చేసిన అనుమతి ముగిసిందని, దాన్ని పునరుద్ధరించాలని తెలిపారు.

ఎన్ఓసీ లేకపోవడంతో పనులు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. భోగాపురం ఎయిర్ పోర్టును త్వరగా పూర్తి చేసేందుకు కేంద్రం సహకరించాలని సీఎం జగన్ తన లేఖలో కోరారు. అనుమతులు వేగంగా మంజూరు చేసేలా ప్రధాని నరేంద్ర మోదీ పౌర విమానయాన మంత్రిత్వ శాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

More Telugu News