Pavan Kalyan: 'భీమ్లా నాయక్' హిందీ వెర్షన్ కొత్త రిలీజ్ డేట్!

  • ఈ రోజునే విడుదలైన 'భీమ్లా నాయక్'
  • తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయి రెస్పాన్స్
  • త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే హైలైట్  
  • వచ్చేనెల 4న హిందీ వెర్షన్ రిలీజ్
Bheemla Nayak movie update

పవన్ కల్యాణ్ - రానా కాంబినేషన్లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందిన 'భీమ్లా నాయక్' ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. సితార బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, భారీ ఓపెనింగ్స్ ను రాబట్టినట్టుగా చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో చాలా వేగంగా బుకింగ్స్ ను పూర్తిచేసుకున్న సినిమాల్లో కూడా ఒకటి అని అంటున్నారు.

ఈ సినిమాను హిందీలో కూడా ఈ రోజునే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అందుకు సంబంధించిన పనులు పూర్తికాకపోవడం వలన, చివరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకున్నారు. మార్చి 4వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో హిందీలో విడుదల చేయనున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న సంగతి తెలిసిందే.

త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే - సంభాషణలు సమకూర్చిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన స్వరపరిచిన పాటలు ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతూ వెళ్లాయి. నిత్యామీనన్ .. సంయుక్త మీనన్ కథానాయికలుగా అలరించే ఈ సినిమాలో, సముద్రఖని .. రావు రమేశ్ .. మురళీ శర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

More Telugu News