Gutta Jwala: బాలికలను ఇలా పాఠశాలల గేట్ల వద్ద అవమానించడం మానేయాలి: గుత్తా జ్వాల‌

  • పాఠ‌శాల‌ల‌కు బాలిక‌లు తమను తాము శక్తిమంతం చేసుకోవడానికి వస్తారు
  • స్కూలే వారి సురక్షిత స్వర్గం
  • నీచ రాజకీయాల నుంచి బాలిక‌ల‌ను తప్పించాలి
  • హిజాబ్ వివాదంపై గుత్తా జ్వాల‌
gutta slams politics on child

విద్యా సంస్థల్లో విద్యార్థినులు హిజాబ్‌ ధరించడం స‌రికాదని, యూనిఫాంలో మాత్ర‌మే రావాల‌ని వ‌స్తోన్న‌ డిమాండ్ దేశ వ్యాప్తంగా చర్చ‌నీయాంశ‌మైన విష‌యం తెలిసిందే. క‌ర్ణాట‌క‌లో విద్యా సంస్థలను నిన్న‌టి నుంచి మ‌ళ్లీ తెరిచిన నేప‌థ్యంలో మ‌ళ్లీ హిజాబ్ వివాదం ప్రారంభ‌మైంది. కొన్ని రోజుల క్రితం చోటు చేసుకున్న ఘ‌ట‌న‌లే మ‌ళ్లీ నిన్న చోటు చేసుకున్నాయి. కొంద‌రు విద్యార్థినులు హిజాబ్‌ ధరించి పాఠ‌శాల‌లోకి వ‌స్తుండ‌డాన్ని కొంద‌రు అడ్డుకుంటుండ‌డం ప‌ట్ల ప్ర‌ముఖులు త‌మ అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు.

తాజాగా, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల కూడా ఈ వివాదంపై స్పందించింది. బాలికలను స్కూళ్ల గేట్ల వద్ద అవమానించడం మానేయాల‌ని ఆమె సూచించింది. పాఠ‌శాల‌ల‌కు బాలిక‌లు తమను తాము శక్తిమంతం చేసుకోవడానికి వస్తార‌ని, స్కూలే వారి సురక్షిత స్వర్గంగా ఉంటుంద‌ని అన్నారు. నీచ రాజకీయాల నుంచి బాలిక‌ల‌ను తప్పించాల‌ని ఆమె కోరింది. చిన్నారుల‌ మనసుల్లో మచ్చపెట్టకూడ‌ద‌ని ఆమె పేర్కొంది. హిజాబ్ పేరిట చెల‌రేగుతోన్న‌ వివాదాన్ని ఆపాల‌ని కోరింది.

More Telugu News