Asaduddin Owaisi: ​​నాకు జెడ్ కేటగిరీ భద్రత వద్దు... న్యాయం కావాలి: అసదుద్దీన్ ఒవైసీ

  • యూపీలో ఒవైసీ వాహనంపై కాల్పులు
  • జెడ్ కేటగిరీ భద్రత కల్పించిన ప్రభుత్వం
  • తాను సామాన్యుడిగానే ఉంటానన్న ఒవైసీ
  • కాల్పులకు పాల్పడిన వారిని శిక్షించాలని విజ్ఞప్తి
Owaisi says he do not want Z Category security

ఉత్తరప్రదేశ్ లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పులు జరిగిన నేపథ్యంలో కేంద్రం ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది. యూపీ కాల్పుల వ్యవహారంపై ఒవైసీ పార్లమెంటులో ఎలుగెత్తారు. తనకు చావంటే భయంలేదని, తనకు జెడ్ కేటగిరీ భద్రత అవసరంలేదని అన్నారు. దయచేసి తనకు న్యాయం చేయాలని, తనపై కాల్పులు జరిపిన దుండగులను యూఏఈపీ చట్టం కింద బోనులో నిలపాలని కోరారు.

విద్వేషానికి, విద్రోహకరశక్తులకు ముగింపు పలకాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానంటూ ఒవైసీ లోక్ సభలో పేర్కొన్నారు. "ఎవరు వీళ్లు? వీళ్లకు బ్యాలెట్లపై నమ్మకంలేక బుల్లెట్లనే నమ్ముకున్నారా? ఇలాంటి విద్రోహకర శక్తుల ఆటకట్టించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి" అంటూ విజ్ఞప్తి చేశారు.

"నన్ను 'ఏ క్లాస్' పౌరుడిగా మార్చే ఈ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ నాకొద్దు. సామాన్యుడిగా నాకు ప్రజల్లో ఉండడమే ఇష్టం" అని స్పష్టం చేశారు. ఆమధ్య ప్రధానమంత్రి భద్రతా ఏర్పాట్లలో లోపం జరిగినప్పుడు స్పందించిన విపక్ష నేతల్లో తాను కూడా ఉన్నానంటూ ఒవైసీ వ్యాఖ్యానించారు.

More Telugu News