F3: గుమ్మడికాయ కొట్టేసిన ఎఫ్3... ఇక నవ్వుల జర్నీ షురూ

  • వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్3
  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిత్రం
  • షూటింగ్ పూర్తయిందన్న యూనిట్ 
  • ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదల
Anil Ravipudi new movie wrap ups shooting

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ఎఫ్3. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో వెంకీ, వరుణ్ ల సరసన తమన్నా, మెహ్రీన్ కథానాయికలు. ఈసారి వెంకీ, వరుణ్ లకు సునీల్ కూడా తోడయ్యాడు. ఎఫ్2 తరహాలోనే ఎఫ్3 కూడా నవ్వుల పండుగేనని చిత్రబృందం హామీ ఇస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ కామెడీ ఎంటర్టయినర్ మూవీకి దిల్ రాజ్ నిర్మాత. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

More Telugu News