ISMART JODI: ప్రెస్ నోట్: "ఇష్మార్ట్ జోడి" సీజన్ 2 స్టార్ మా లో…!

 
Ishmart Jodi Season 2 is back on Star Maa from Today

ప్రెస్ నోట్:  ప్రేక్షకులకు కనువిందు చేయడానికి, వినోదంలో విహరింపచేయడానికి స్టార్ మా "ఇష్మార్ట్ జోడి" సీజన్ 2. ఓంకార్ ప్రెజెంటర్ గా ఆయన దర్శకత్వంలో ఇష్మార్ట్ జోడి సీజన్ 1 పెద్ద విజయం సాధించింది. మరిన్ని అదనపు ఆకర్షణలతో ఇప్పుడు రెండో సీజన్ ప్రారంభించడానికి సర్వం సిద్ధం అయింది.
 
మనకి వివిధ సీరియల్స్ లో, రకరకాల కార్యక్రమాల్లో కనిపించే సెలెబ్రిటీలు ఈ షో లో సందడి చేయబోతున్నారు. రకరకాల రౌండ్స్ లో ఈ జంటలు ఈ సీజన్ లో మనల్ని అలరించబోతున్నారు. ప్రీతీ నిగమ్ - నగేష్, బాబా భాస్కర్ - రేవతి, కౌశల్ - నీలిమ, అమ్మ రాజశేఖర్ - రాధ, అవినాష్ - అనుజా, శివారెడ్డి - స్వాతి రెడ్డి, కౌశిక్ - భవ్య, మహేశ్వరీ-శివనాగ్, ఏకనాథ్ -హారిక, లహరి - ధీరేన్, హర్షిత - వినయ్, విశ్వ - శ్రద్ధ... ఈ సీజన్ లో వినోదాన్ని అందిస్తూ "ఇష్మార్ట్ జోడి" టైటిల్ కోసం పోటీ పడబోతున్నారు.
 
స్టార్ మా తో ఎంతో అనుబంధం వున్న దర్శకుడు ఓంకార్ ఈ సారి ఈ షో నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా తీర్చిదిద్దబోతున్నారు. ఈ షో ఈ 26 నుంచి మొదలవుతుందని స్టార్ మా లో చూసాను. సాయంత్రం 6 గంటలకి గ్రాండ్ లాంచ్ ప్రసారం అవుతుంది.
 
ప్రతి వారం శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకి ప్రసారం అవుతుంది. తప్పక చూడండి.. ఇష్మార్ట్ జోడి సీజన్ 2. మీ అభిమాన స్టార్ మా లో.
 
"ఇష్మార్ట్ జోడీ 2" ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/wl2FbWWlByw
 
Content Produced by: Indian Clicks, LLC

More Telugu News