Allu Arjun: సమంత ఐటమ్ సాంగ్ జోరు మామూలుగా లేదు!

  • 'పుష్ప'రాజ్ గా అల్లు అర్జున్
  • సమంత ఐటమ్ ప్రత్యేక ఆకర్షణ
  • అన్ని భాషల్లోను అదే రెస్పాన్స్
  • ఈ నెల 17వ తేదీన విడుదల  
Pushpa movie update

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన 'పుష్ప' సినిమాను ఈ నెల 17వ తేదీన విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. సుకుమార్ - దేవిశ్రీ కాంబినేషన్లో వచ్చిన ఐటమ్ సాంగ్స్ అన్నీ సూపర్ హిట్టే.

ఇక సమంతతో చేయించిన ఐటమ్ సాంగ్ కూడా అందుకు తగినట్టుగానే దూసుకుపోతోంది. అయితే ఈసారి దేవిశ్రీ ప్రసాద్ ఈ ఐటమ్ సాంగ్ ను రెచ్చిపోయి పాడించకుండా, మత్తుగా .. గోముగా .. కైపుగా పాడించాడు. అందువలన ఈ పాట కొత్తగా అనిపిస్తూ మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

'ఊ అంటావా మామా .. ఊ ఊ అంటావా మావా' అంటూ సాగే ఈ పాట దుమ్మురేపేస్తోంది. ఈ పాటను రిలీజ్ చేసిన అన్ని భాషల్లో కలుపుకుని 45 మిలియన్ వ్యూస్ కి పైగా వచ్చాయి. 1.6 మిలియన్స్ కి పైగా లైక్స్ వచ్చాయి. థియేటర్స్ లో ఈ సాంగ్ మరింత సందడి చేయడం ఖాయమని అంటున్నారు..

More Telugu News