Balakrishna: యూఎస్ లో 'అఖండ' రికార్డ్!

  • వసూళ్ల పరంగా దూసుకుపోతున్న 'అఖండ'
  • బాలయ్య - బోయపాటిలకు దక్కిన హ్యాట్రిక్
  • 100 కోట్ల క్లబ్ లోకి ప్రవేశం
  • యూఎస్ లో మిలియన్ డాలర్ల వసూళ్లు
Akhanda movie update

బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన 'అఖండ' ఇంకా తన జోరు చూపుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా అదే తరహాలో దూసుకెళుతుండటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 2వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఇంతవరకూ 100 కోట్ల వసూళ్లకు పైగా రాబట్టడం విశేషం.

బాలకృష్ణ కెరియర్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నమోదైన 'లెజెండ్' సినిమా, సాధారణ పరిస్థితుల్లోనే యూఎస్ లో హాఫ్ మిలియన్ మార్కును అందుకోలేకపోయింది. అలాంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా అయినా హాఫ్ మిలియన్ మార్కును అందుకుంటే గొప్ప విషయం అనుకున్నారు. అలాంటి వాళ్లందరినీ ఈ సినిమా ఆశ్చర్యపరిచింది.

తాజాగా ఈ సినిమా యూఎస్ లో మిలియన్ మార్కును టచ్ చేసింది. ఈ ఏడాది అక్కడ మిలియన్ డాలర్లను దక్కించుకున్న అతి తక్కువ సినిమాల జాబితాలో 'అఖండ' చేరిపోయింది. బాలకృష్ణ - బోయపాటిలకు హ్యాట్రిక్ హిట్ ఇవ్వడం .. 100 కోట్ల క్లబ్ లో చేరడం .. యూఎస్ లో మిలియన్ డాలర్లను రాబట్టడం 'అఖండ' ఖాతాలో కనిపిస్తున్న అరుదైన విషయాలుగా చెప్పుకోవచ్చు.

More Telugu News