Nani: 'శ్యామ్ సింగ రాయ్' నుంచి కొత్త పోస్టర్!

  • విభిన్నమైన కథాంశంతో నాని సినిమా
  • కలకత్తా నేపథ్యంలో నడిచే కథ
  • నాని సరసన ముగ్గురు నాయికలు
  • ఈ నెల 24వ తేదీన సినిమా విడుదల      
Shyam Singha Roy movie update

1970 కాలం నాటి ఒక కథతో దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ 'శ్యామ్ సింగ రాయ్' సినిమాను రూపొందించాడు. కలకత్తా నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 14వ తేదీన వరంగల్ లో నిర్వహించనున్నారు. ఈ వేదికపై ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ ను వదిలారు. నాని - సాయిపల్లవి జంటగా కనిపిస్తున్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది .. సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

ఈ సినిమాను కలకత్తా సమీపంలోని గ్రామంలోను .. హైదరాబాద్ సమీపంలో 10 ఎకరాల్లో వేసిన సెట్లోను చిత్రీకరించారు. కృతి శెట్టి .. మడోన్నా సెబాస్టియన్ కూడా ఇందులో కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందని నాని భావిస్తున్నాడు. ఈ ఏడాది చివరిలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.

More Telugu News