Britain: పంజా విసురుతున్న ఒమిక్రాన్.. కీలక నిర్ణయం తీసుకున్న బ్రిటన్!

  • బ్రిటన్ లో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
  • 30 ఏళ్లు పైబడిన అందరికీ బూస్టర్ డోసులు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం
  • మన దేశంలో కూడా పెరుగుతున్న కరోనా కేసులు
Britain to give booster dose for those who have 30 years and above age

దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే ఎన్నో దేశాలకు ఈ వేరియంట్ వ్యాపించింది. బ్రిటన్ దేశంలో సైతం ఈ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించింది.

ఈ క్రమంలో బూస్టర్ డోస్ కు సంబంధించి ఈరోజు నుంచి బుకింగులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 40 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసులను అక్కడి ప్రభుత్వం ఇచ్చింది. మరోవైపు బూస్టర్ డోసుల పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని... ప్రతి ఒక్కరు కచ్చితంగా బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించింది.

ఇదిలావుంచితే, మన దేశంలో కూడా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో బూస్టర్ డోసులు ఇవ్వాలనే డిమాండ్లు మన దేశంలో కూడా వినిపిస్తున్నాయి. బూస్టర్ డోసులను పంపిణీ చేయాలని ఇప్పటికే ఏపీ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాశాయి. అయితే బూస్టర్ డోస్ పై ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది. రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవచ్చని తెలిపింది.

More Telugu News