Mali: మాలిలో అల్ ఖైదా అనుబంధ సంస్థ నరమేధం... 31 మంది బలి

  • బండియగర పట్టణం వద్ద ఘటన
  • 50 మందితో వెళుతున్న ట్రక్కు
  • కాల్పులు జరిపిన ఉగ్రవాదులు
  • మంటల్లో చిక్కుకున్న ట్రక్కు
Terrorist attack in Mali killed thirty one people

ఆఫ్రికా ఖండంలోని మాలి దేశంలో అల్ ఖైదా అనుబంధ సంస్థ ఉగ్రదాడికి పాల్పడింది. ఈ ఘటనలో 31 మంది సాధారణ పౌరులు మృతి చెందారు. బండియగర పట్టణం వద్ద రోడ్డుపై ట్రక్కు వెళుతుండగా, అల్ ఖైదా అనుబంధ సంస్థకు చెందిన టెర్రరిస్టులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దాంతో ఆ ట్రక్కు మంటల్లో చిక్కుకుంది.

ఆ సమయంలో ట్రక్కులో 50 మంది వరకు ఉన్నారని బండియగర నగర మేయర్ హుస్సేనీ సాయే వెల్లడించారు. ఈ ఘటనలో అత్యధికులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచారని తెలిపారు. పలువురు గాయపడ్డారని, ఇద్దరి జాడ తెలియడంలేదని హుస్సేనీ వివరించారు. ఈ దారుణానికి ఇంతవరకు ఎవరూ బాధ్యత ప్రకటించనప్పటికీ, ఇది అల్ ఖైదా అనుబంధ గ్రూపు పనేనని భావిస్తున్నారు.

More Telugu News