Zoo: హైదరాబాదు జూ పార్కులో యువకుడి కలకలం... సింహం ఎన్ క్లోజరులో దూకేందుకు యత్నం 

  • సాయికుమార్ అనే యువకుడి హంగామా
  • సింహం ఎన్ క్లోజరు పైభాగానికి చేరిన వైనం
  • యువకుడి కోసం కాపు కాసిన సింహం
  • యువకుడ్ని తరలించిన జూ సిబ్బంది
Man creates high tension in Hyderabad Zoo

హైదరాబాదులోని నెహ్రూ జూలాజికల్ పార్కులో ఓ యువకుడు హంగామా సృష్టించాడు. సింహం ఉండే ఎన్ క్లోజరులో దూకేందుకు ప్రయత్నించి అందరినీ హడలెత్తించాడు. ఎన్ క్లోజరు పైభాగంలో ఉన్న గుహ వంటి నిర్మాణం మీదకు ఎక్కిన యువకుడు లోపలికి దిగేందుకు ప్రయత్నించగా, జూ సిబ్బంది అడ్డుకున్నారు. కాగా, ఆ యువకుడు గుహపై ఉండగా, కొన్ని అడుగుల కిందనే సింహం ఉండడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు.

ఆ సింహం కూడా కాసేపు అతడు దూకుతాడేమోనని అక్కడే కాపు కాసింది. కాసేపటి తర్వాత అది అవతలికి వెళ్లిపోయింది. అయితే ఎన్ క్లోజరు వెనుక నుంచి వచ్చిన జూ సిబ్బంది అతడిని అక్కడి నుంచి తరలించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ యువకుడి పేరు సాయికుమార్ అని గుర్తించారు.

More Telugu News