Nani: ఎగసిపడే అలజడే 'శ్యామ్ సింగ రాయ్' .. సాంగ్ ప్రోమో!

  • నాని తాజా చిత్రంగా 'శ్యామ్ సింగ రాయ్'
  • కలకత్తా నేపథ్యంలో నడిచే కథ
  • ఈ నెల 6వ తేదీన ఫస్టు సింగిల్
  • డిసెంబర్ 24వ తేదీన సినిమా విడుదల  
Shyam Singha Roy Song Promo Released

నాని కథానాయకుడిగా 'శ్యామ్ సింగ రాయ్' సినిమా నిర్మితమైంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 1970లో కలకత్తా నేపథ్యంలో నడుస్తుంది. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో, నాని కొత్త లుక్ తో కనిపించనున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్లు అంచనాలు పెంచుతున్నాయి.

తాజాగా ఈ సినిమా నుంచి 'రైజ్ ఆఫ్ శ్యామ్' పేరుతో సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. 'శ్యామ్ సింగ రాయ్ .. ఎగసిపడే అలజడివాడే ..  తిరగబడే సంగ్రామం వాడే .. వెనకబడని చైతన్యం వాడే' అంటూ ఈ పాట సాగుతోంది. నాని పాత్ర స్వభావాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట నడిచింది.

మిక్కీ జె. మేయర్ స్వరపరిచిన ఈ పాటకి కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా, విశాల్ దద్లాని - అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ నెల 6వ తేదీన ఈ పాటను ఫస్టు సింగిల్  గా వదలనున్నారు, సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా కథానాయికలుగా నటించిన ఈ సినిమాను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయనున్నారు.

More Telugu News