America: అమెరికాలో మళ్లీ కాల్పులు.. తోటి విద్యార్థులపై తుపాకి ఎక్కుపెట్టిన విద్యార్థి

  • టెక్సాస్ అర్లింగ్టన్‌లోని టింబర్ వ్యూ పాఠశాలలో ఘటన
  • కాల్పులు జరిపిన 18 ఏళ్ల తిమోతీ
  • ఒకరి పరిస్థితి విషమం
  • నిందితుడిపై మూడు అభియోగాలు మోపిన పోలీసులు
Student taken into custody hours after Texas school shooting

అమెరికాలో తుపాకి మళ్లీ గర్జించింది. విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ కాల్పులకు కారణమైంది. టెక్సాస్‌లోని అర్లింగ్టన్‌లో జరిగిందీ ఘటన. ఇక్కడి టింబర్ వ్యూ పాఠశాలలో విద్యార్థుల మధ్య ప్రారంభమైన ఘర్షణ తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన 18 ఏళ్ల విద్యార్థి కాల్పులు ప్రారంభించగా భయంతో అందరూ పరుగందుకున్నారు. ఈ క్రమంలో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

సమాచారమందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపి పరారైన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పాఠశాలలో మొత్తం 1900 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కాల్పులు జరిపిన నిందితుడిని తిమోతీ జార్జ్ సింప్‌కిన్స్‌గా గుర్తించారు. అతడిపై మూడు అభియోగాలు నమోదు చేశారు. కాగా, తీవ్రంగా గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News