Hyderabad: ఇక ఎక్కడా ఆగకుండా హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లిపోవచ్చు!

  • హైదరాబాద్ నుంచి లండన్ కు నాన్ స్టాప్ సర్వీసులు
  • ప్రవేశపెట్టిన ఎయిరిండియా
  • నేటి నుంచి అందుబాటులోకి సర్వీసులు
  • 9 గంటల్లో లండన్ చేరిక
Non stop services from Hyderabad to London

ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లాలంటే మార్గమధ్యంలో దుబాయ్, అబుదాబి వంటి నగరాలకు చేరుకుని అక్కడ్నించి మళ్లీ ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం లేదు! హైదరాబాద్ నుంచి లండన్ కు నాన్ స్టాప్ విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. ఎయిరిండియా నేటి నుంచి లండన్ కు నాన్ స్టాప్ సర్వీసులు ప్రవేశపెడుతోంది.

ఈ విమాన సర్వీసులు వారంలో రెండు పర్యాయాలు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి లండన్ వెళతాయి. ఇవి హైదరాబాద్ నుంచి లండన్ లోని హీత్రూ ఎయిర్ పోర్టుకు 9 గంటల్లో చేరుకుంటాయి. గతంలో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం చాలా అధికంగా ఉండేది. ఇప్పుడు ఎంతో సమయం ఆదా కానుంది.

More Telugu News