Ayush Sinha: రైతుల తలలు పగలగొట్టాలంటూ ఆదేశాలిచ్చిన హర్యానా అధికారిపై బదిలీ వేటు

  • ఇటీవల హర్యానాలో రైతుల ఆందోళన
  • రైతులపై పోలీసుల లాఠీచార్జి
  • గాయాలపాలైన రైతులు
  • సదరు అధికారిపై తీవ్ర విమర్శలు
Haryana govt transfers IAS officer Ayush Sinha

ఇటీవల రైతులు హర్యానాలోని కర్నాల్ లో చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారడం తెలిసిందే. పోలీసులు రైతులపై విరుచుకుపడగా, రైతులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియోలో కర్నాల్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆయుష్ సిన్హా... రైతుల తలలు పగలగొట్టండి అంటూ ఆదేశాలివ్వడం కనిపించింది. దాంతో ఆ అధికారిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ విమర్శల సెగ సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ ను కూడా తాకింది.

తాజాగా, హర్యానాలో 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేయగా, వారిలో ఆయుష్ సిన్హా కూడా ఉన్నారు. సిన్హాను సిటిజెన్ రీసోర్సెస్ ఇన్ఫర్మేషన్ విభాగం అదనపు కార్యదర్శిగా నియమించారు. సిన్హా 2018 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. కాగా, ఆయుష్ సిన్హా తన విధి నిర్వహణలో సరిగానే వ్యవహరించినా, ఆదేశాలు ఇచ్చే సమయంలో ఆయన ఎంచుకున్న మాటలు అభ్యంతరకరం అని సీఎం ఖత్తర్ అభిప్రాయపడ్డారు.

More Telugu News