Yash: కన్నడ హీరో యశ్ దాతృత్వం... సినీ కార్మికులకు రూ.1.5 కోట్లు వితరణ

  • సినీ పరిశ్రమలపై కరోనా పంజా
  • కన్నడ చిత్ర పరిశ్రమ కోసం స్పందించిన యశ్
  • 3 వేల మందికి ఒక్కొక్కరికి రూ.5 వేలు
  • ఇది చిన్న సాయం మాత్రమేనన్న యశ్
Kannada hero Yash donates huge amount to cine labour

కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభంలో సామాన్యుడి వెతలు అన్నీ ఇన్నీ కావు. సినీ పరిశ్రమలపైనా కరోనా పంజా విసరడంతో రోజువారీ కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది. ఈ నేపథ్యంలో, కన్నడ సినీ కార్మికులను ఆదుకునేందుకు యువ హీరో యశ్ ముందుకొచ్చారు. ఈ క్రమంలో ఆయన పెద్ద మనసు ప్రదర్శిస్తూ రూ.1.5 కోట్ల భారీ విరాళం ప్రకటించారు.

దాదాపు 3 వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాలో వేస్తున్నట్టు యశ్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే సమస్యకు ఇది పరిష్కారం అని తాను అనుకోవడంలేదని, ఇది ఒక చిరుసాయం మాత్రమేనని, భవిష్యత్ దిశగా ఆశలు కలిగించే ఓ చిన్న ప్రయత్నం మాత్రమేనని వినమ్రంగా తెలిపారు.

More Telugu News