Israel: భీకరంగా మారుతున్న ఇజ్రాయెల్-హమాస్ పోరు.. కీలక ఆయుధాన్ని ధ్వంసం చేశామన్న ఇజ్రాయెల్

  • ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్ గ్రూప్ మధ్య కొనసాగుతున్న దాడులు
  • ఇరువైపులా జరుగుతున్న ప్రాణనష్టం
  • హమాస్ డ్రోన్ జలాంతర్గామిని ధ్వంసం చేసిన వీడియో ఫుటేజీలు విడుదల
 underwater drone attack by Hamas from northern Gaza

ఇజ్రాయెల్-హమాస్ మధ్య మొదలైన ఘర్షణలు క్రమంగా భీకర యుద్ధానికి దారితీసేలా ఉన్నాయి. హమాస్ తీవ్రవాదులు, ఇజ్రాయెల్ దళాల మధ్య జరుగుతున్న పరస్పర దాడుల్లో పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. ముఖ్యంగా పాలస్తీనియన్లు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గాజా నుంచి హమాస్‌ను తరిమికొట్టే వరకు వెనక్కి తగ్గొద్దన్నది ఇజ్రాయెల్ యోచనగా తెలుస్తోంది.

హమాస్‌కు అత్యంత కీలకమైన ఆయుధాన్ని తాము ధ్వంసం చేసినట్టు ఇటీవల ప్రకటించిన ఇజ్రాయెల్ తాజాగా, అందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేసింది. సముద్ర జలాల్లో ఇజ్రాయెల్ గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలను ధ్వంసం చేసేందుకు ఉపయోగించే డ్రోన్ జలాంతర్గామిని నాశనం చేసినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. ఇందుకు సంబంధించి గాల్లో నుంచి తీసిన రెండు ఫుటేజీలను విడుదల చేసింది. ఒక బాంబు సముద్ర జలాల్లో పడగా మరోటి సమీపంలోని కారుపై పడింది. కాగా, ఇజ్రాయెల్ చమురు క్షేత్రంపై హమాస్ దాడికి యత్నించినట్టు ‘డెయిలీ మెయిల్’ పేర్కొంది.

More Telugu News