Andhra Pradesh: రెండు రోజులు ఎండ మంటలు... ప్రజలు బయటకు రావద్దన్న ఐఎండి!

  • విదర్భ నుంచి ఉపరితల ద్రోణి
  • 3 డిగ్రీల వరకూ అధిక ఉష్ణోగ్రత
  • కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం
More Heat in Next Two Days Warns IMD

తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో భానుడి ప్రతాపం అధికంగా ఉంటుందని, దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణంతో పోలిస్తే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఆపై ఎండ వేడిమి స్వల్పంగా తగ్గుతుందని అంచనా వేశారు. విదర్భ నుంచి మరాట్వాడా వరకూ, కర్ణాటక నుంచి తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణులు కొనసాగుతుండటమే ఇందుకు కారణమని ఓ అధికారి వెల్లడించారు.

ఇదే సమయంలో ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఎండ వేడిమి అధికంగా ఉన్న ప్రాంతాల్లో అత్యవసరమైతేనే, తగు జాగ్రత్తలు తీసుకుని ప్రజలు బయటకు రావాలని సూచించారు.

More Telugu News