Senete: భారత సంతతి మహిళకు మరో కీలక పదవి... డీసీ కోర్టు న్యాయమూర్తిగా పుట్టగుంట రూపా రంగాను నామినేట్ చేసిన బైడెన్

  • పలువురు భారత సంతతి వ్యక్తులకు పదవులు
  • తాజాగా పది మంది న్యాయమూర్తుల నియామకం
  • ఖరారు చేసిన సెనేట్
Puttagunta Roopa is Selected by Joe Biden for DC Judge

ఇప్పటికే పలువురు భారత సంతతి వ్యక్తులకు, ముఖ్యంగా మహిళలకు కీలక పదవులను ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ - అమెరికన్ రూపా రంగా పుట్టగుంటను ఫెడరల్ జడ్జ్ గా నియమించారు. ఆమె నియామకాన్ని సెనేట్ కూడా ఆమోదించింది. మొత్తం పది మంది న్యాయమూర్తులను బైడెన్ నామినేట్ చేశారు. వీరిలో ఫెడరల్ సర్క్యూట్, డిస్ట్రిక్ట్ జడ్జ్ పోస్టులతో పాటు కొలంబియా సుపీరియర్ కోర్ట్ న్యాయమూర్తి పదవి కూడా ఉంది.

బైడెన్ ఎంచుకున్న వారంతా తమ వృత్తిలో అత్యుత్తమ ప్రతిభ ఉన్నవారేనని, విభిన్న సంస్కృతుల అమెరికన్ ప్రజలకు వీరంతా ప్రాతినిధ్యం వహించేలా ఫెడరల్ బెంచ్ ఉంటుందని వైట్ హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక, డిస్ట్రిక్ట్ ఆఫ్ డీసీ న్యాయమూర్తిగా ఎన్నికైన తొలి ఏషియన్ ఆమెరికన్ పుట్టగుంట రూపా రంగా అని ఈ సందర్భంగా సెనేట్ ప్రతినిధులకు శ్వేతసౌధం అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం రూపా రంగా, డీసీలోనే రెంటల్ హౌసింగ్ కమిషన్ విభాగంలో అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ గా ఉన్నారు. అంతకుముందు 2019 వరకూ సోలో ప్రాక్టీషనర్ గా కొనసాగారు. 2013లో ఆమె డిలానీ మెక్ కెన్నీ ఎల్ఎల్పీ నుంచి ఫ్యామిలీ అండ్ అపిలేట్ లాలో నైపుణ్యాన్ని పొందారు. డీసీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి విలియమ్ ఎం జాక్సన్ వద్ద లా క్లర్క్ గానూ పని చేశారు. 2007లో ఓహియో స్టేట్ మార్టిజ్ కాలేజ్ ఆఫ్ లా నుంచి జూరిస్ డాక్టర్ డిగ్రీని పొందిన ఆమె, 2010 నుంచి రెండేళ్ల పాటు డీసీ కోర్ట్ ఆఫ్ అపీల్స్ లో జడ్జిగానూ సేవలందించారు.

More Telugu News