Tamil Nadu: పాఠశాలలను తెరవాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం

  • 9వ తరగతి ఆపై క్లాసుల విద్యార్థులకు స్కూళ్లను తెరవాలనుకున్న ప్రభుత్వం
  • కరోనా నేపథ్యంలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ప్రభుత్వం
  • తమిళనాడులో 7.5 లక్షల కరోనా కేసులు
Tamil Nadu Holds Off On Reopening Schools

ఈనెల 16 నుంచి తొమ్మిదో తరగతి, ఆపై క్లాసులకు సంబంధించిన విద్యార్థులకు పాఠశాలలను ప్రారంభించాలనే నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. విద్యార్థులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పాఠశాలలను ప్రారంభించాలని కొందరు తల్లిదండ్రులు చెప్పినప్పటికీ... ఎక్కువ మంది కరోనా భయాలతో స్కూళ్లను తెరవద్దని కోరారని పేర్కొంది.

రీసెర్చ్  స్కాలర్లు, ఫైనలియర్ పీజీ విద్యార్థులకు డిసెంబర్ 2 నుంచి కాలేజీలు, యూనివర్శిటీలను ప్రారంభిస్తామని చెప్పింది. ఇప్పటి వరకు తమిళనాడులో 7.5 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 11,415 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో తమిళనాడు ఐదో స్థానంలో ఉంది.  

More Telugu News