Tirumala: పదేళ్లలోపు వాహనమైతేనే కొండపైకి అనుమతి: టీటీడీ కీలక నిర్ణయం

  • అలిపిరి వద్దే వాహన తనిఖీ
  • తిరుమలలో నో హారన్ జోన్
  • వెల్లడించిన ఏఎస్పీ మునిరామయ్య
Tirumala Vehicle Rules

వాహనం కొనుగోలు చేసి, పదేళ్లు దాటితే, వాటిని తిరుమల కొండపైకి అనుమతించరాదని టీటీడీ నిర్ణయించింది. ఈ విషయాన్ని వెల్లడించిన ఏఎస్పీ మునిరామయ్య, భక్తులు ఈ విషయాన్ని గమనించి, కాలపరిమితి దాటిన వాహనాలతో కొండపైకి రావద్దని కోరారు.

వీటి కాలపరిమితిని అలిపిరి చెక్ పోస్టు వద్దే తనిఖీలు చేసి, భక్తులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. తిరుమలలో 'నో హారన్ జోన్' అమలవుతోందని, హారన్ మోగిస్తే, జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు. ఘాట్ రోడ్డుపై ఫిట్ నెస్ లేని వాహనాలతో ప్రయాణాలు ప్రమాదానికి కారణమని, అటువంటి వాహనాలతో ప్రయాణిస్తే, చర్యలు తప్పవని హెచ్చరించారు.

More Telugu News