Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర నిర్మాణంలో తిరుగులేని నాణ్యత.. వెయ్యేళ్లపాటు పదిలంగా ఉండేలా నిర్మాణం!

  • ప్రకృతి విపత్తులకు తట్టుకుని ఎదురు నిలిచేలా నిర్మాణం
  • 200 అడుగుల లోతు వరకు తవ్వి మట్టి పరీక్షలు
  • ఒకేసారి 10 వేల మంది దర్శించుకునేలా డిజైన్
Ayodhya Ram Mandir will long last for 1000 years

అయోధ్యలో నిర్మించబోయే రామ మందిరాన్ని అత్యున్నత న్యాణ్యతతో ఎటువంటి ప్రకృతి విపత్తులు ఎదురైనా తట్టుకుని వెయ్యేళ్లు చెక్కుచెదరకుండా ఉండేలా నిర్మించనున్నారు. ఎంతలా అంటే.. 10 తీవ్రతతో భూకంపం సంభవించినా ఏమీ కానంతగా ప్రముఖ ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సోమ్‌పుర డిజైన్ చేశారు.

రెండెకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మించి, మిగతా స్థలంలో అనేక రకాల చెట్లు పెంచుతారు. అలాగే, మ్యూజియంతోపాటు ఆలయానికి అనుబంధ భవనాలను నిర్మిస్తారు. ఆలయ నిర్మాణం బలంగా ఉండేందుకు 200 అడుగుల లోతు వరకు తవ్వి మట్టిని పరీక్షించారు. వెయ్యేళ్ల వరకు ఆలయ రూపంలో కానీ, ఆకృతిలో కానీ ఎలాంటి మార్పులు ఉండనంతంగా దీనిని నిర్మిస్తున్నట్టు నిర్మాణ పనుల సూపర్ వైజర్ అన్నుభాయ్ సోమ్‌పుర తెలిపారు. అంతేకాదు, ఒకేసారి 10 వేల మందికిపైగా భక్తులు సందర్శించుకునేలా దీనిని డిజైన్ చేసినట్టు వివరించారు.

More Telugu News